Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 197 సంకీర్తన: 204
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 23
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మారువధన్యాసి
ఆటది జాణ కాకుంటే - అందేమున్నది
నీటుతో తిరిగినదే - నేరుపింతే గాక
॥పల్లవి॥
పనిలేని సుద్దులెల్లా - పచరించగానేమి
ననిచిన యీ పొద్దె - నడి జామాయ
యెనసి యిప్పుడేమి - యేకాంతమాడీనే
చనవున సరసాన - సంగడి గూర్చుండీనిది
॥ఆటది॥
వెడమాయల జాలి వేరే - బెట్టంగా (నేమి)
చిడిముడి యిది యెంత - సేపాయ
జడియక తానెన్ని - సటలు సేసీనే
తొడపై దొడ వేసీని - దొరతనమున
॥ఆటది॥
ఆవలీవల నెలత - (లమరు) కోగానె
శ్రీవేంకటనాథుని - చిత్తమెట్లాయ
యీ వేళ నాకు చన - విచ్చి కూడేనే
వోవరిలో తానేల - వూరకే వుండినది
॥ఆటది॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము