Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 235 సంకీర్తన: 246
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 24
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి[1]
ఆన వెట్టుదువు నీవప్పటి[2] నానోరణఁచి వోరి[3]
నీ నిజానకు నాతో నేఁడైన మానరా[4]
॥పల్లవి॥
పచ్చడాన జవ్వాది పరిమళమేడదిరా
పచ్చిసేఁతలు చెక్కిళ్లపై నీకేడవిరా
గచ్చుమోవిమీఁదనున్న కసిగాటులేడవిరా
యిచ్చకుఁడ కనుఁగెంపులేడవి గలిగెరా[5]
॥ఆన॥
ముద్దుల[6] చక్కని నీదు మోముకళలేడవిరా
కొద్దిగాని సందొత్తుగోరేడదిరా[7]
గద్దరీఁడ యీ చిట్లు[8] గందము నీకేడదిరా
తిద్దెను గస్తూరిబొట్టు దిమ్మరి యెవ్వతిరా[9]
॥ఆన॥
భీతితో నీవాడేటి[10] తబ్బిబ్బు మాటలేడవిరా
రాతిరేడ నుండితి[11] వెరవక చెప్పరా
యేతరీఁడ తిరువేంకటేశ నన్ను నేలితివి[12]
యేతులతో వలపించ నెంత కలికివిరా[13]
॥ఆన॥

(ఈ సంకీర్తన 5వ సంపుటంలో 222వ సంకీర్తనగా ఉంది.)

[1] తం.ప్ర 30. ధ్రువతాళం
[2] తా.వేం.235; తం.ప్ర.ఆనలు వెట్టేవు సారె అప్ప
[3] ‘వోరి’ లేదు
[4] తం.ప్ర. ఆనాలు నీకే తోడగురా అది యింకా మానవురా; తా.వెం. ఆనలు నీకు తోడారా నేడింక మానవురా
[5] తా.వెం. గెంపులివి యేడవిరా
[6] తం.ప్ర. ముద్దుగారేనీ
[7] కొద్దిగా నొక్కిన సంది గోళ్ళేడవిరా; తా.వేం. కొద్దిగా నూఁదిన సంది
[8] తా.వేం. చిట్లిన
[9] సా.రే. తిద్దినది గోరు జూటుదిమ్మరి యెవ్వతెరా (తా.వేం.లో ఈ చరణము 1, 2 పాదములు తారుమారైనవి)
[10] సా.రే. బీతు లేక నీవాడే
[11] తా.వేం. రాతిరెందు వోతివో
[12] తం.ప్ర. ఈతరి శ్రీవేంకటేశ యిట్టె ననుఁ గూడితివి
[13] ఈ తీరు సారె వలపించ యెంత కలికివిరా; తా.వేం.ఈతరి చొక్కించితివి యెంత
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము