సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 268 సంకీర్తన: 284
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 25
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 268 సంకీర్తన: 284
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 25
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి - జంపె
| ఆపరాని వలపాయ - నమ్మలార! యింతి యేపులకు లోనాయ - నికనేమి సేతుమే | ॥పల్లవి॥ |
| ఆరగించుమనగదరె - అమ్మలార! అయో, నీరు పుక్కిలించ దిది - నిన్నట నుండి ఆరినది బోన మెల్ల - అమ్మలార! అయో, శ్రీరమణుడింతట వి - చ్చేయడేమి సేతమే | ॥ఆపరాని॥ |
| అద్దమరేతిరి యాయ - అమ్మలార! చెలి నిద్దుర కంటబెట్టదు - నిన్నటి నుండి అద్దంపుజెక్కులవాడె - అమ్మలార! నేడు యిద్దరి కోపము దీర - దిక నేమి సేతమే | ॥ఆపరాని॥ |
| అల సతే ఘనమాయ - నమ్మలార! దీని నిలుపవశము గాదు - నిన్నట నుండి అలమీ వేంకటపతి - అమ్మలార! యిప్పు డెలయించి కూడకున్నా - డిక నేమి సేతవే | ॥ఆపరాని॥ |


