Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 73 సంకీర్తన: 72
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 26
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
ఆపాటి కీపాటి - కాయమేమియు లే(దు)
యేపాటయిన బాళి - కెంత సేయుదువో
॥పల్లవి॥
చక్కగ పోకలంతేసి - చన్నులయినంతలోనె
నిక్కుచు నూరకే నిర్ర - నీల్గే (వదేమే)
నిక్కమందరివలె - నిండు వయసు తొట్టితే (?)
చక్కగ పాదాలు నేల - సరిమోపవేమో
॥ఆపాటి॥
కురులు దువ్విన (నెరులు) - కొప్పుగూడవు సమము
విరుచుక వికవిక న-వ్వేవదేమే?
తరుణి పిక్కలు దాఁక - నెరులానగలిగితే
గురుతెవ్వరని నీవు - యెరుగలేవేమో
॥ఆపాటి॥
కలియనెరుఁగవు చక్క-గా నీవు విభునితో
పొలతి పోకలవెన్ని - (బొయ్యేవె నీవు)
కలసితే గనక వేం-కటగిరి దేవునకు
అలమేలుమంగవై - అల(రార వేమే)!
॥ఆపాటి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము