Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 172 సంకీర్తన: 177
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 28
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
ఆయనాయ చాలులె - మ్మన్నట్టుండవమ్మా, పొందు
సేయసేయ సేయంగ మరి - సేయనే మనసయీనమ్మా
॥పల్లవి॥
వోడక చూచితే నున్న - ట్లుండదోయమ్మా, యప్పని
చూడజూడ జూడగామరి - చూడనే మనసయీనమ్మ
॥ఆయనాయ॥
తనివి లేదు వాని కత లెం - త విన్న మరి
వినవిన వినగా మరి - విననే మనసయీనమ్మ
॥ఆయనాయ॥
చేనంటి యలమేల్మంగ -శ్రీవేంకటేశా యని
యానయాన నానగా మరి - యాననే మనసయీనమ్మ
॥ఆయనాయ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము