Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 107 సంకీర్తన: 107
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 49
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: అమరసింధు - ఏక
ఎంత మాయదారివాడు - యెట్టులైన సేయగలడు
వింతలు నేర్చినవాడు గో - (విందుడు వీడు)
॥పల్లవి॥
మ్రొక్కేననినా వినడు - ముద్దు వెట్టినా నొల్లడు
పక్క పండనైనా రాడు - పణతీ! వీడు
నిక్కెపు మాటలాడడు - నేరమిదనీ యెంచడు
దక్కితినన్న గైకోడు - తరుణీ! వీడు
॥ఎంత॥
పువ్వులు సిగజుట్టడు - పొత్తులనారగింపడు
నవ్వు(తా)యింటికి రాడు - నాతిరో! వీడు
రవ్వగా మాటలాడడు - రంగుగ జోడుపాడడు
దవ్వులనుండీ చూడడు - తరుణీ! వీడు
॥ఎంత॥
గందము మేనబూయడు - గట్టిగ గుబ్బలలమడు
సందీయని కౌగిలీయడు - సఖియా! వీడు
విందై వేంకటరాయడు - వెలదిని గూడిపాయడు
యిందరిలో నెవ్వతె నా - యీడూ జోడూ?
॥ఎంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము