సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 119 సంకీర్తన: 120
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 52
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 119 సంకీర్తన: 120
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 52
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్ర
| ఎంత రాతి మనసుది - యెంత కట్టడి గలది పంతమిందునగానియేరు - పడదాయనా | ॥పల్లవి॥ |
| పక్కున పూవుదాకితేనే - పాలుగారీని చెక్కులు ఉక్కుగోటికొద్ది యెట్టు - నొక్కి చొక్కించితిరా మక్కువ నాసరిగా - మన్నించితేనేమాయ, తన చక్కదనమిందుగాని - యెక్కుడు గాదాయనా | ॥ఎంత॥ |
| అంటిన గొబ్బునకందు - నంట నీమోవి వజ్రపు పంటికొద్ది యెట్టునొక్కి - గంటి జేసితివిరా నంటున గోరంటగా చ - నవిచ్చితేనేమాయ, తన దంటతనమెందునగాని - తలకూడాదాయనా | ॥ఎంత॥ |
| వొరసితే వసివాడు - (విరిచెండు నీతనువు) బిరుసు చంటి కొద్ది యెటు - బిగియించితివిరా తిరువేంకటాధిప! నీ - తరుణైతె నేమాయ, తన దొరతనమందుగని - తుదిముట్టదాయనా | ॥ఎంత॥ |


