సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 231 సంకీర్తన: 242
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 53
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 231 సంకీర్తన: 242
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 53
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| ఎంత సేసినా సేయనీ - యేమాయను, నా యంతరంగమెల్ల తా - నై యున్నాడే చెలియా | ॥పల్లవి॥ |
| చలము సాధించి నాకు - చనవియ్యకుండుగాని కలనైనా కూడకుండఁ - గర్తయటవే పలుకబడీనని కో - పము దెచ్చుకొనీగాని సొలసి దవ్వులనుండి - చూడనైనా నియ్యడా | ॥ఎంత॥ |
| కనుగొందునోయని యి - క్కడికి రాకుండుగాని తనమేలు విని సం - తసమంద నీయడా తనుసంగమమునకు - దాకర్త యింతేకాని మనసులో కూడకుండ - మగువ! తానెవ్వడే | ॥ఎంత॥ |
| చిత్తములో ప్రేమ వం - చించుగాక నామేన హత్తుకొన్న పులకల - నాగీనా తాను చిత్తజుకేళిని నేడు - శ్రీకృష్ణుడు ననుగూడె కొత్తలు సేసితే తన - గుట్టు నే దెలియనా | ॥ఎంత॥ |


