Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 219 సంకీర్తన: 230
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 57
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
ఎటువలె నా ప్రాణేశుని - యెప్పుడు నాతో గూరిచి
(యి)టువలె నా ప్రాణంబులు - యెత్తుకొనే వొకొ చెలియా
॥పల్లవి॥
పడతుక! (మల్లెలు మొల్లలు) - పచరించిన చిరునవ్వులు
అడవిని కాసిన వెన్నెల - యై పోవకయుండా;
విడువక వీనులవిందై - వేడుక చూపెడు నా పా
టడరెడు చెవికి (ది) కిన్నెర - యై పోవక యుండా
॥ఎటువలె॥
జలజానన! చొక్క (పు పొం - జక్కవలగు) పాలిండ్లివి
అలుకని చిలుకని విందులె - యై పోవకయుండా;
కొలదికి మీరిన తేనెలు - గులికెడు నా కెమ్మోవు(ల)
ఫలమందని మాని ఫలం - బై పోవక యుండా
॥ఎటువలె॥
ఘనకుచ! పనుపడు మినుకులు - దొణికెడు ముద్దుల నా మో
మనిశము (చే)కొను (న)ద్దం - బై పోవకయుండా;
పనివడి సమరతి వేంకట - పతితోనే నా ముచ్చట
లనయము రాచిలుకల చదు - వై పోవకయుండా
॥ఎటువలె॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము