సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 50 సంకీర్తన: 49
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 58
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 50 సంకీర్తన: 49
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 58
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| ఎట్టుగలిగెనె లలన - యెటు (నే) దెలియగలన యిట్టి మధుకర కలన - హృదయేశువలన | ॥పల్లవి॥ |
| కొప్పుఁగూడని కురులు - కురువాడియున్న విరులు ముప్పిరిగొను కంటసరులు - ముద్దుమోముపై గురులు దప్పిదేరు ముఖసిరులు - దళుకొత్తు కుచగిరులు చిప్పిలు నొసటి చెమరులు - చెక్కు చందురులు | ॥ఎట్టు॥ |
| నడపులోపలి యలపు - నవ్వుమాటల సొలపు నిడుదపయ్యట వలపు - నిదుర కలగలపు వొడలి పులకలమొలపు - వువిదయుండెడి సొలపు సుడిగొన్న మైయలపు - సోద్యంపు తలఁపు | ॥ఎట్టు॥ |
| పలుకులోపలి కొదలు - పతినిబాయని కదలు గిలుకు మెట్టెల (రొదలు) - కెంపు కనుతు(దలు) పొలుపారు నీవి వదలు - పొందు హర్షపు కథలు గెలుపు సంపద (మెదలు) - కృష్ణుగూడిన మొదలు | ॥ఎట్టు॥ |


