Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 187 సంకీర్తన: 194
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 59
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
ఎట్టు గలిగెరా మోహ - మింతలో నీకు
తట్టుపడి తిరిగేవు - తాళుకోరాదా
॥పల్లవి॥
మురిపాన కొనగోర - ముద్దు చెక్కుల మీన
నొరసి జీరలు చీరె - నువిద నిన్ను
నెరిగురులు జారగా - నిదుర కన్నుల లేచి
మరచి దాని పేర - మమ్ము (బిలుతువుగదర)
॥ఎట్టు॥
నిండు చెమటలు జార - నిట్టూర్పు లెడలేక
నుండు బడలికెల - నులికి పడుచు
అండ కౌగిటిలోన - నంటిన వాసనలు
మెండుకొని నీ మేన - మేళవించె గదర
॥ఎట్టు॥
పగడంపు వాతెరను - పలుగంటి సేవలను
నిగిడి కెంపుల చాలు - నించి నించి
అగపడి కూడితివి - అన్నిటను శ్రీకృష్ణ!
తగిలి జిగిబిగి రతుల - తమకింతువదెరా
॥ఎట్టు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము