సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 53 సంకీర్తన: 52
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 63
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 53 సంకీర్తన: 52
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 63
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం - ధ్రువ
| ఎలనాగ నేనేమైన - నెగ్గుమాటలాడితినా చలము సాధించి నాతో- జగడించేవదేమే | ॥పల్లవి॥ |
| తొట్టిన పెంజెమటలు - దుడుచుకొమ్మంటే అట్టె కోపగించద - వదేమే చుట్టుకొన్న ముంగురులం - చునదేర్చుకొమ్మంటే నెట్టన బొమముడి - వెట్టేవదేమే | ॥ఎలనాగ॥ |
| (చి) టులు గంధము నల - చి వేసుకొమ్మంటే (అటు) మిట్టి పడే - వదేమే (నటనలు) తడబడక - నడచుకొమ్మంటే కటకటా కన్నుల - గద్దించేవదేమే | ॥ఎలనాగ॥ |
| అలవి మీరిన పులకల - నణచు కొమ్మంటే అలివేణి నాతోడ - నలిగే వదేమే యెలమి వేంకటపతి చి - న్నెలు దాచుకొమ్మంటె (కొలదెరుంగని సిగ్గు - గులికేవదేమే) | ॥ఎలనాగ॥ |


