Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 96 సంకీర్తన: 96
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 64
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కేదారగౌళ - అట
ఎలనాగ! పంచాంగ - మేటికి వినవలె?
తెలియంగ నీ (వల్లె) - కలిగె నిన్నియును
॥పల్లవి॥
నను గనినయంతనే - నగుమోముతో నేడు
వనిత! నీవెదురుగా - వచ్చుటే రాక
ఒనరంగ నీ వమృత - మూర నేర్పు మిగుల
యెనసి మాటాడు నదె - యిందువాసరము
॥ఎలనాగ॥
జలజాక్షి! పెనకువ - జడ నన్ను జుట్టుకొన
చెలిమి నలముటె యా - శ్లేష భాషితము
చెలువుడ! నీవు నా - చెంత రారా యని
సొలపుతో గూడునది - శోభనయోగము
॥ఎలనాగ॥
(వెలది!) శ్రీవేంకట - (విభు) నన్ను రతి గూడి
బలిమి నెద కెక్కుటే - భద్ర కరణము
కలికి! నీ వన్నిట - గారవించితి గాన
జలజాస్త్రు విజయమై - సాగు (నను) దినము
॥ఎలనాగ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము