Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 20 సంకీర్తన: 18
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 66
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
ఎవ్వరికి జెప్పరా - (దిట్టి సౌభాగ్యమ్ము)
నివ్వటిలు నీ వేడ్క - నీవె వినవమ్మ
॥పల్లవి॥
సరవినే దుర్గములు - సాదించెనొ యెరుగము
గిరికుచ నీవె త - ర్కించవమ్మ
సిరినే రాజుతో సంధి - సేసెనో యెరుగము
హరిణాంకముఖి! నీవె - యాలోకించవమ్మ
॥ఎవ్వరికి॥
బలిమినే ఘనుని (చెర) - బట్టెనో యెరుగము
జలదవేణి! నీవె వి -చారించవమ్మ
మెలగి యే చక్ర మాక్ర - మించెనో యెరుగము
యిల (సైకత) నితంబ! యూ - హించవమ్మ
॥ఎవ్వరికి॥
చేవనే సింహాసనము - చేకొనీ నెరుగము
సోవల హరిమధ్య! - శోధించవమ్మ!
ఆ వేంకటపతి యే నిధి తా - నాశించెనో యెరుగము
వేవేగ పద్మనేత్రి! నీ - వే యరయవమ్మ
॥ఎవ్వరికి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము