Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 159 సంకీర్తన: 162
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 70
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: తోడి
ఏటిమాటలాడేవు - యిందాకానీవు
వాటముగనిట్టే - వళుకులాడకురా
॥పల్లవి॥
పయ్యెదలో వాలినవె - పట్టియియ్యవె జక్కవల
కొయ్యకాడ కావురా సం - కోచములింతే
ముయ్యనేటికే అట్లైతే - మొనసి చూపగదే
యియ్యెడ నా పైడిబిందె - లెట్టుజూపవచ్చురా
॥ఏటి॥
వొడిలోన దాగెనదే- వొప్పగించవే సింహము
గడుసుకాడ కావురా నా - నడుమింతే
విడిచి శోధనియ్యవే - విచ్చనవిడియట్లైతే
సుడిసి ఆకాశమెట్లు - శోధనియ్యవచ్చురా
॥ఏటి॥
కుచ్చెల మరుగుజొచ్చె - కొమ్మ! నెముళ్ల నివే
అచ్చపు నడపులే గాని - (యవి నెమళ్లు కావురా)
గుచ్చి శ్రీవేంకటనాథ - గుర్తెరిగి యట్లయితే
యిచ్చ గూడితిమిక - యీ గురుతులేలరా
॥ఏటి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము