Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 94 సంకీర్తన: 93
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 73
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదనామక్రియ
ఏమిటను గొద లేదు - యిగురుబోణిని జూడ
నేమమున తలపోయ - నీకె తగునయ్య
॥పల్లవి॥
రమణి నీలపు (నెఱులు) - రంగు తుమ్మెద (బరులు)
నెమలి పించపు సిరులు - నెలత ముంగురులు
కమలాక్షి కనుగోము - కళల కెల్లను గీము
అమరంగ విధుసమము - అతివ నెమ్మోము
॥ఏమని॥
నిక్కపు నీడల జూపు - నీలోత్పలము యేపు
మక్కువ మదనుని తూపు - మదిరాక్షి చూపు
చక్కని బంగరు గుండ్లు - సంపెంగి పూచెండ్లు
చొక్కంపు నిమ్మపండ్లు - సుదతి పాలిండ్లు
॥ఏమని॥
రోమ (రేఖల తీరు - రోయు చీమల బారు
భామ యూరుల సౌరు - పైడి రంభల మీరు
ఆమె యమ్మలకమ్మ - యలమేలు మంగమ్మ
ప్రేమ ముద్దులగుమ్మ శ్రీ - వేంకటేశుని కొమ్మ)
॥ఏమని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము