సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 139 సంకీర్తన: 6
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 75
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 139 సంకీర్తన: 6
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 75
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కళ్యాణి
| ఏమి సేతు నిన్ను బాసి - యే నుండ లేనురా నా (మొరాలకించి) - నన్ను మన్నింపరా | ॥పల్లవి॥ |
| పనిబడి నాపై యలుకలు - పచరించే వేరా, నే మనసు (లేని) మరునిబారి - మారుకొన లేరా | ॥ఏమి॥ |
| కలనైనా నిన్ను గాన - క యున్నది (లేదురా) కలదా (మరి) యెన్నడైన - గారవించి యేలరా | ॥ఏమి॥ |
| తలపు మెత్తనిదాన - తాప మోర్వలేనురా (నలువున) దయతో - నన్ను నేలుకోరా | ॥ఏమి॥ |
| పలుమారు నన్నేలక - పగ చాటే వేరా (పలుకోర్వగా లేను) - పడుచుదాన గదరా | ॥ఏమి॥ |


