సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 94 సంకీర్తన: 141
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 76
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 94 సంకీర్తన: 141
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 76
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది[1] - జంపె
| ఏమి సేయుదునమ్మ యిన్నియును నిటుగూడె [2]తామసపుఁ బ్రేమ వేదనఁ బాయనీదు | ॥ఏమి॥ |
| కినిసి నే సొలసి పలికెద నంటినా యతని- నెనయుఁ దడఁబాటు నోరెత్తనీదు చెనకి యలపార[3] జూచెద నంటినా యతని- కనుఁగవ జలంబు సరుగునఁ జూడనీదు | ॥ఏమి॥ |
| కిందుపడి కదిసి మ్రొక్కెద నంటినా యతని- యంది (నంది?) పరవశము[4] చేయాడ నీదు డెందంబు మఱచి యుండెద నంటినా యతనిఁ జెందిన తఁలపు మఱచియు మఱవనీదు | ॥ఏమి॥ |
| తిరువేంకటేశుఁ బొందితినంటినా[5] యతని- దొరతనము నాగరిమ దోఁచనీదు సిరిదొలఁకు రతుల నలసితి[6] నంటినా యతని- సరసంబు వేడుకలఁ జాలించనీదు | ॥ఏమి॥ |
(ఈ సంకీర్తన 5వ సంపుటంలో 113వ సంకీర్తనగా ఉంది.)
[1] తా.వెం; తం.ప్ర. కాంబోది-ఝంపె తాళము
[2] తా.వేం. నాతామస
[3] తా.వేం. యెలవార
[4] తం.ప్ర.అందినా పరవశత
[5] తం.ప్ర; తా. వేం. గలసెద నంటినా
[6] నలసెద నంటి


