Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 144 సంకీర్తన: 146
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 82
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బిళాపచారి
ఏలర? నాతో యింత చల - మేలరా రంగా
బాల చాల నాపై మేలుదానను - జాలి బెట్టుక ప్రేమ నన్ను
॥పల్లవి॥
పిలిచినా పలుకవు - యెలమితో కన్నెత్తి
తిలకింప వొకసారి - యలవి మీరి
అలరార నాతో మా - టైన నాడవు
చెలువుడా నేనేమి - చేసితిరా నీకు
॥ఏలర॥
యెంత వేడినగాని - యింటికి రావు
సంతసాన నొకపుడు - సరసమాడవు
వింతవస్తువులేమి - వేడ్క నాకొసగవు
కాంతుడా నేనేమి - కానిపని చేసితిరా
॥ఏలర॥
వోవరికి వేగరావు - ఊరకె జాగు చేసేవు
కానరాని కళలంటి - కరగింపవు
భావజుకేళి గూడియు - బాగుగా నలయింపవు
శ్రీవేంకటప్రభుడ - వేమి చేసితిరా
॥ఏలర॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము