సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 223 సంకీర్తన: 235
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 83
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 223 సంకీర్తన: 235
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 83
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
| ఏల వలచితిమి మన - మేటికి కలిగితిమి యీలాగు అలుక లిక - యెన్నటికి వలదు | ॥పల్లవి॥ |
| వొనగూడి యిద్దరము - వొకరి కొకరమె తగిలి యెనసినది మొదలు - యెడబాయ మెన్నడును మనకు అలుగుట తగదు - మనలోన యెడ (లేదు) మనసిజుడు సందుకొని - మనల నేచీరా | ॥ఏల॥ |
| అలర నమ్మిక మాట - లాడుకొని యిద్దరము అలనాటినుండి యెడ - మాడ(నే మె)రుగము పలుకకేలుంటిమో - పలుకకుండగగ(లమొ) పలుమారు మనయెడల - పలికి కోవిలలు | ॥ఏల॥ |
| అలుకదీరని రతుల - కలుకలే చవులనుచు అలగితిమిగాక మన - కలుకలేడవిరా అలర శ్రీవేంకటేశు - (డలమేలుమంగ యెడ నలుక దీరిన వెనుక - నక్కు జేర్చెనుగద) | ॥ఏల॥ |


