Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 266 సంకీర్తన: 281
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 86
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి - అట
ఒడలి తాపముమీఁద నుసురనీని
కడలేని చిచ్చుమీఁద గాలి చల్లీఁ దరుణి
॥పల్లవి॥
జల్లనం గొప్పువిరులు జారఁదోచి జవరాలు
మెల్లనే తుమ్మిదలకు మేఁత వెట్టీని
చెల్లఁబో మీఁ దెఱుంగదు జెప్పరమ్మ పెనుఁబాము
పిల్లలకుఁ బాలువోసి పెంచఁజూచీఁ దరుణి
॥ఒడలి॥
గొప్పవైన గుబ్బలపైఁ గుంకుమకస్తురిపూఁత
లప్పలు గాలికిఁ దెచ్చి లంచ మిచ్చీని
ఒప్పదు మానుపరమ్మా ఉప్పతిలఁ బలుమారు
నిప్పులమీఁదటఁ దెచ్చి నేయి చల్లీఁ దరుణి
॥ఒడలి॥
చెనకించి యధరంపుఁ జిగురాకు కెంపుల
నొనరుఁ గోవిల నోరూరించీని
చనవున వేంకటస్వామి కౌఁగిటఁ గూడి
కినిసి పాసెములూఁ జక్కెర వెట్టెఁ దరుణి
॥ఒడలి॥

(ఈ సంకీర్తన 6వ సంపుటంలో 163వ సంకీర్తనగా ఉంది.)

AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము