సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 96 సంకీర్తన: 109
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 89
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 96 సంకీర్తన: 109
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 89
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: రామక్రియ
| ఓహోహో యనరో పారి సాహసానఁ దిరుగరో జంటపారి | ॥పల్లవి॥ |
| కోనేటిరాయఁడు కోరి నిద్రించీ వాఁడే ఆనకమై జాలీయరో ఆఁడు బారీ పేనిపట్టి వాకిళ్ళ బీగముద్రలాయ నిడి కానిమ్మని వాయించరో గంట పారి | ॥ఓహోహో॥ |
| తిరుపణి మణఁగెను తిరుగరా దెవ్వరికి మరల నెలుగియ్యరో మగపారి పరగ దేవత లెల్ల బడకెళ మున్నారు యిరవాయ సూర్యచంద్రు లెదురు పారి | ॥ఓహోహో॥ |
| శ్రీవేంకటేశ్వరుఁడు చిత్తగించీ లోననదె కోవర మెన్నికెరో కోటిపారి ఆవల బంగారుగుదియలు ఘల్లు రనఁగా తావుల హనుమంతునితలారి పారి | ॥ఓహోహో॥ |
(ఈ సంకీర్తన 15వ సంపుటంలో 118వ సంకీర్తనగా ఉంది.)


