సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 59 సంకీర్తన: 58
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 93
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 59 సంకీర్తన: 58
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 93
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
| కటకటా అయ్యో కాంత నింత యేపుదురా అటమటముగాదు నీ యాన సుమ్మీ నిజమయ్య | ॥పల్లవి॥ |
| కొసరినా నిన్నే కాని కోపించినా నిన్నే కాని కసరినా నిన్నే కాని కాదన్నా నిన్నే కాని విసరినా నిన్నే కాని వేసరినా నిన్నే కాని ఇసుమంతైనా అన్యమెఱుఁగదయ్యా | ॥కటకటా॥ |
| అలసినా నిన్నే కాని ఆఁకొన్నా నిన్నే కాని పిలిచినా నిన్నే కాని పేరుకొన్నా నిన్నే కాని సొలసినా నిన్నే కాని సోఁకనాడినా నిన్నే కాని కలనైనా తలఁపెందూ కలుగదు గదవయ్యా | ॥కటకటా॥ |
| కొనియాడినా నిన్నే కాని గుంపించినా నిన్నే కాని పని(న?)వినా నిన్నే కాని పాడినా నిన్నే కాని మనసిచ్చి యలమేలుమంగపతి వేంకటేశ యెనసితివి మా చెలి నింక నేచ నేమిటికయ్యా | ॥కటకటా॥ |


