Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 258 సంకీర్తన: 272
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 96
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
కప్పురపు (కళుకులు) - కలికి నీ పలుకులు
వొప్పుగ నీ వాలించితేనే చె - వులు చల్లనయ్యీనీ
॥పల్లవి॥
పంచదార పానకమా - పణతి నీ కావి మోవి
యించుకంత చవి గొంటె - హెచ్చ(రిల్లీని)
కంచుతాళపు చిప్పలా - కన్నె! నీ గబ్బి గుబ్బలు
యించుకంత గోరుదా - కించితే ఖణింగురనీని
॥పల్లవి॥
జడియనెమ్మి పింఛమా - సఖియ నీ పెందురుము
తొడికితే కెంగేలు - దుసికిలీని
వడకని కారుమించా - వనిత! నీ నెమ్మేను
జిడిముడి కన్నులు - జీరికలు వారీని
॥పల్లవి॥
కనియుగానని యణువా - కన్నె నీ నెన్నడుము
ఘనముగా నూదితేనే - గాలి బొయ్యీని
తనివోని యాఖువా - తరుణి! నీ ప్రాయము
యెనసి శ్రీవేంకటపతి - (యెదను) కారించినీ
॥పల్లవి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము