Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 16 సంకీర్తన: 13
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 97
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
కరము జీడిపులుసు - గలిగిన మామిడి - కరము సోకినయంతనే
సరవిఁ జక్కెరవలెఁ - జవి గలిగించువాని - చనవరి సుతుఁ డితఁడే
॥పల్లవి॥
వేఁకరి మండెముకోట - వెళ్లుతా విచ్చన-విడి రాఁగా వొక
వీఁకతో వేసిన కత్తి - వే తునుకలాయ - వెన్ను సోఁకినయంతనే
ఆ కాలమునాఁడు రాతి నాతిఁ - జేసె ఆతఁడేపో యీతఁడు
వాకుచ్చి పొగడరో ఘనపుణ్యము (గల) తాళ - పాక తిరుమలయ్యను
॥కరము॥
గుములు గూడి యలుఁ - గులు తిరుగఁబాఱి చుట్టు - కొన్న కురువదోవ నతఁడు
కమలనయనునిఁ దలఁ - చినమాత్రాన - కకపికలై పాఱెను
అమరఁ బాం - చాలికి వలువలొసఁగి - నతఁడెవో యీతఁడు
ప్రమదముతోడుత - పేరుకొనరే తాళ - పాక తిరుమలయ్యను
॥కరము॥
దేవుఁ డొకకన్ను - దయచేసి తనవద్దికి నంపిన నతఁడు
పావను డితఁడు తా - నొక్క కన్నిచ్చె పరుషలు చూడఁగా
శ్రీవెంకటప్పని - సేవ చేయఁగోరి - చేకొన్నతను వితఁడు
భావించి పొగడరో - భాగ్యము గల తా - ళపాక తిరుమలయ్యను
॥కరము॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము