సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 44 సంకీర్తన: 43
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 108
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 44 సంకీర్తన: 43
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 108
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: లుప్తము
| కొమ్మ నీ పలుకులకు - కుశలమస్తు సమ్మదపు వయసు కై - శ్వర్యమస్తు | ॥పల్లవి॥ |
| బెడగు కళలను జాల - పెంపొందుచున్న నీ యుడురాజు మోము క - భ్యుదయమస్తు కడు నొప్పు నీరజపు - కళికల గేరు నీ వెడద కుచములకు నభి - వృద్ధిరస్తు | ॥కొమ్మ॥ |
| జిగి మిగులగ తేనె - జిలుకు చున్నట్టి నీ చిగురు మోవికిని ఫల - సిద్ధిరస్తు సొగసు చక్రములతో - సొలయు నీ పిరుదులకు అగణిత మనోరథా- వాప్తిరస్తు | ॥కొమ్మ॥ |
| తనరు తుమ్మెదగముల - తరుము నీ కురులకును ననుపమం బైన దీ - ర్ఘాయురస్తు నను ద్వారకాకృష్ణు - డనుచు గూడిన నీకు ననుదినము నిత్య క - ల్యాణమస్తు | ॥కొమ్మ॥ |


