సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 236 సంకీర్తన: 247
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 109
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 236 సంకీర్తన: 247
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 109
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| గందము వూసేవేలె కమ్మని మేన యీ గందము నీమేనితావికంటె నెక్కుడా | ॥పల్లవి॥ |
| అద్దము చూచేవేలే అప్పటప్పటికిని అద్దము నీమోముకంటె నపురూపమా ఒద్దిక తామరవిరినొత్తేవు కన్నులు నీ గద్దరికన్నులకంటె కమలము ఘనమా | ॥గందము॥ |
| బంగారు వెట్టేవేలే పడఁతి నీమెయినిండా బంగారు నీతనుకాంతి ప్రతివచ్చీనా ఉంగరాలేఁటికినే వొడికపువేళ్ల[1] వెంగలిమణులు నీ వేలిగోరఁ[2] బోలునా | ॥గందము॥ |
| సవర మేఁటికినే జడియు నీ నెరులకు సవరము నీకొప్పుసరి వచ్చీనా యివలఁ జవులు నీకునేలే వెంకటపతి సవరని కెమ్మోవిచవికంటేనా | ॥గందము॥ |
(ఈ సంకీర్తన 5వ సంపుటంలో 2వ సంకీర్తనగా ఉంది.)
[1] తా.వెం. లేఁటికే యువిదనీవేళ్లకు
[2] నిడురేకు. గోరిబోలునా


