Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 240 సంకీర్తన: 250
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 113
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్ర - అట
చందమామ రావో - జాబిల్లి రావో మంచి
కుందనంపు పైడి వెన్న - కోర పాలు తేవో
॥పల్లవి॥
నగుమోము చక్కనియయ్యకు - నలువ బుట్టించిన తండ్రికి
నిగమములందుండే యప్పకు, మా - నీలవర్ణునికి
జగమెల్ల యేలిన స్వామికి - చక్కని యిందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికి, మా - ముద్దుల మురారి బాలునికి
॥చందమామ॥
తెలిదమ్మి కన్నుల మేటికి, మంచి - తియ్యని మాటలగుమ్మకు
కలికి చేతల కోడెకు, మా - కతలకారి యీ బిడ్డకు
కులముద్ధరించిన పట్టికు మంచి - గుణములు కలిగిన కోడెకు
నిలువెల్ల నిండు వొయ్యారికి, నవ - నిధుల చూపుల సుగుణునకు
॥చందమామ॥
సురలగాచిన దేవరకు - చుంచు గరుడని నెక్కిన గబ్బికి
నెరవాది బుద్ధుల పెద్దకు, మా - నీటు చేతల పట్టికి
విరులవింటి వాని యయ్యకు, వే - వేల రూపుల స్వామికి
సిరిమించు నెరవాది జాణకు, మా - శ్రీవేంకటనాథునకు
॥చందమామ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము