Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 35 సంకీర్తన: 34
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 121
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
చెలులారా! చేరిచూడరే - శ్రీవేంకటేశుని
గలియూ నలమేలుమం - గను
॥పల్లవి॥
చందురునందు చీకట్లుండె నే, - వోయమ్మలాల!
సంపంగి పై తుమ్మెద లా డేనే
ముందు మొల్ల - మొగ్గ లొదవేనే, - వో యమ్మలాల!
మోవి పగడ కాంతులొలికేనే
॥చెలులారా॥
బంతులపై చుక్కలమరీనే - వో యమ్మలాల
పలుకు వీణె శంఖ మొత్తేనే
అంతరమున పాము నిలిచెనే - వో యమ్మలాల
అచటనొక్క కొలను బుట్టెనే
॥చెలులారా॥
యేనుగ కుంభములు కలిగెనే, - వో యమ్మలాల!
యెసఁగ పసిడి దిన్నె (లాయెనే)
పూని దామరలు పూచెనే - వో యమ్మలాల!
పొలుపుమీర కాళెలయ్యీనె
॥చెలులారా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము