సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 182 సంకీర్తన: 188
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 127
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 182 సంకీర్తన: 188
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 127
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| తప్పకజెప్పరా వోరి! - దాచక నీవు యెప్పుడు నీ వద్ద కాక - యెడసి యుండేనా | ॥పల్లవి॥ |
| సందెకాడ రమ్మనంగ - ఝాము పోయి వచ్చితివి విందు వలె నెవ్వతెకు - వెచ్చమైతి వో అందరు మగువలైనా - ఆపె నంటిన కౌగిలి యిందు గలిపేదంటా - యింత లోగేను | ॥తమలోనే॥ |
| పిలువ నంపిన చెలి - బిట్టు కూడితివిందాక తలపు నీ కక్కడెనె - తమకించెనో చలము నీతో గాదు - చవి దప్పినందు మీద బలిమి గలయ బోతే - పసలేని పనులౌను | ॥తమలోనే॥ |
| కప్పురమె పంపుమంటే - గందవొడి యంపితివి అప్పుడక్కడ ప - రాకై యుండితివో యిప్పుడె శ్రీవేంకటేశ! - యిటు నన్ను గూడితివి నెప్పున నీ కడమైనా - నీవే కలవు | ॥తమలోనే॥ |


