Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 209 సంకీర్తన: 220
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 129
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: పంతురావళి
తరితీపె తరుకాడు - తగులె పట్టుగొమ్మ తనకు నాకు
(పరివోని సురత సం - పదలె యింపులు మాకు)
॥పల్లవి॥
నేనేమంటినమ్మ - నిన్నమాపువాడు - నెలవంక చెక్కుల నీటుతో రాగా
ఆనందాన అమాసవై రెండె దినా - లాయనంటె దోసమా
పూని చెక్కు జీరేట - ప్పుడు కలిగిన - వోరుపు నేడేల - వుడివోయనమ్మా
వానిదూరనేల - వలపుల శివమెత్తి - వలసినట్టుండ నీవే
॥తరితీపె॥
వ్యంగెమాయనట్టె - వరువాత కపురపు కెం - పులమోవితో రాగ
అంగడి జామెక్కి తెల్లవా - రంగ వచ్చెనంటె దోసమా
చెంగట ముని పల్లు నాటిం - చగా లేని సిగ్గులు
(చెంగలించి) నేడేల - చిగురించె నమ్మా
॥తరితీపె॥
అందుకేమాయనే చిత్తడి చెమట - లంటినమేనితో నంటునరాగ
అందమై వానకుము(ందెవంగు) - డాయెనంటె దోసమా
అంది శ్రీవేంకటనాథు(డరమరికలులేక) - అగ్గలపురతినేలె నోయమ్మా
మందలించనేలే - మదనకేళి జొక్కి మట్టుమీరనీవే
॥తరితీపె॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము