సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 215 సంకీర్తన: 226
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 132
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 215 సంకీర్తన: 226
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 132
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: పాడి
| తలమేల కులమేల తపమే కారణము యెలమి హరిదాసులు యే జాతి యైన నేమి | ॥పల్లవి॥ |
| కాకమువల్లఁ బుట్టదా ఘనమైన యశ్వత్ధము దాకొని గుల్లలోఁ బుట్టదా ముత్తెము చౌకైన విషలతనే జన్మించదా నిర్విషము యేకడ మహానుభావు లెందు పుట్టి రేమి | ॥తలమేల॥ |
| బిడిపిరాళ్ళఁ బుట్టవా చెలువైన వజ్రములు పుడమి నీఁగలవల్లఁ బుట్టదా తేనె వెడఁగుఁ బిల్లిమేనను వెళ్ళదాయెనా జవ్వాది వుడివోని పుణ్యు లెందు నుదయించి రేమి | ॥తలమేల॥ |
| పంకములోఁ బుట్టదా పరిమళపుఁ దామెర పొంకపుఁ గీటకములందు పుట్టదా పట్టు కొంకక శ్రీవేంకటేశుఁ గొలిచినదాసులు సంకలేని జ్ఞాను లెందు జనియించి రేమి | ॥తలమేల॥ |
(ఈ సంకీర్తన 15వ సంపుటంలో 285వ సంకీర్తనగా ఉంది.)


