సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 151 సంకీర్తన: 153
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 141
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 151 సంకీర్తన: 153
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 141
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
| తేనెను (తేగా) బోవలె - తెరువియ్యరా ఆనలు బెట్టకురా! మా - యమ్మ వినీనీ | ॥పల్లవి॥ |
| చెట్టబట్టకురా - చెప్పిన ట్టుండరా చెట్టు కొక రున్నారు - చెంచెతలు పట్టపగలురా! - భయము లే దటరా? వట్టి (నేటికి) రా! మా - వదిన వినీనీ | ॥తెలిసి॥ |
| మెల్లనె మాటా(డ)రా - మెడ చెయ్యి దియ్యరా (కుల్లు) చెంచెతలురా - కొల్లలు కొల్లలు చల్లుబో(?)రాడకురా - సతులు కనేరా అల్ల వాడుగో రా మా - యన్న వినీనీ | ॥తెలిసి॥ |
| కురులు దువ్వకురా - గుబ్బ లంటకురా, యే మఱగు నైనా వచ్చి - మన్నించే గానీ తిరువేంకటాద్రి - దేవుడవై కూడితివి మరలి చెంచెతనై నీ - మగువ నైతి గానీ | ॥తెలిసి॥ |


