సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 123 సంకీర్తన: 124
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 143
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 123 సంకీర్తన: 124
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 143
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మధ్యమావతి
| దిద్దుకో వలెగాక - (తీవర) పడియె నౌనా వద్దురా తిల్ల గోవింద - వయసున చిన్నది! | ॥పల్లవి॥ |
| నెలత పడుచు దైన - నేర్పుల యిక్కని తలపు తె(లి)యక లేక - నళికీ నింతే వలనుగా ని(క్క)పు - వజ్రమైనా సా నలదీర కూరకే - తళకు (లీనే)నా? | ॥దిద్దుకో॥ |
| తెరవ బాల యైన - సరసముల నె(ల)వని సరుసత నెరుగక - వెరచీ నింతే పరగ పదార్వన్నె - బంగారమైనను మెరుగు బెట్టక తానె - మిను(కుమనీ)నా? | ॥దిద్దుకో॥ |
| పూవుబోణి మేని - తావుల (కిక్కువ)ని భావ మరయ లేక - పంకించె నింతె శ్రీవేంకట ప్రభుడు - దీని జవ్వాది (యౌ) పూవుగట్టక మే(ల్మి) - తావు లీనీనా? | ॥దిద్దుకో॥ |


