సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 79 సంకీర్తన: 78
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 145
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 79 సంకీర్తన: 78
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 145
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్యాసి
| దేవదేవం భజే దివ్యప్రభావం రావణాసురవైరి రఘుపుంగవం | ॥పల్లవి॥ |
| రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహునీలాభ్రకాయం రాజారికోదండరాజదీక్షాగురుం రాజీవలోచనం రామచంద్రం | ॥దేవ॥ |
| నీలజీమూతసన్నిభశరీరం ఘనవి- శాలవక్షం విమలజలజనాభం తాలాహినగహరం ధర్మసంస్థాపనం భూలలనాధిపం భోగిశయనం | ॥దేవ॥ |
| పంకజాసనవినుతపరమనారాయణం శంకరార్జితజనకచాపదళనం లంకావిశోషణం లాలితవిభీషణం వేంకటేశం సాధువిబుధవినుతం | ॥దేవ॥ |
(ఈ సంకీర్తన 1వ సంపుటంలో 314వ సంకీర్తనగా ఉంది.)


