సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 201 సంకీర్తన: 210
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 147
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 201 సంకీర్తన: 210
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 147
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
| దేవరకే చెల్లెనో - దేవరాజ, నీవు దేవర వైతివి గదా - దేవరాజ | ॥పల్లవి॥ |
| తిరుమణి సొగసాయ - దేవరాజ తెరగెన్నడు గానము - దేవరాజ తెరవనేల యేచేవు - దేవరాజ, అది (తిరుమాన)మెన్నడు - దేవరాజ | ॥దేవరకే॥ |
| తీరాయ చెక్కిటి గోరు - దేవరాజ తీరెక్కడలేదు - దేవరాజ తేరని సొమ్మాపెకిచ్చిది - దేవరాజ, అది తేరకగాక సతము - దేవరాజ | ॥దేవరకే॥ |
| తెరవనంపైన దేవు - దేవరాజ, యీ (తరుణికిదే) తలపాయ - దేవరాజ తిరువేంకటకాంతుడా - దేవరాజ, స్వామి తిరుగా పెరుందేవి గూడితివి - దేవరాజ | ॥దేవరకే॥ |


