Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 249 సంకీర్తన: 261
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 150
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: సౌరాష్ట్ర
నన్నే పిలవవయ్య - నాతో నీకెగ్గు లేదు
వున్నవేళ నీవు లెస్స - వున్నదే చాలదా
॥పల్లవి॥
అయ్యయ్యో యేపొద్దున ర - మ్మన్న నే రానా
దయ్యమా నా మోము చూడ - దగదా నీకు
ముయ్యక యెవ్వరి మో-ములు జూచితివో, మోవి
వయ్యలాయ చెక్కుజీరు - వారె వాతను
॥నన్నే॥
అక్కట నీ కతలె - న్నైన నూకొనన
దక్కిన నాతోనె మాటాడ - తగదా నీకు
తక్కక యెవ్వతె వాకు - దాకెనో నీ మాటలు
పెక్కువాయ మేనలసె - పెను పండుగ లాయను
॥నన్నే॥
ఔనౌ నీ కౌగిట నేను - ఆడుమన్నట్టెల్లానాడనా?
కానుకలు నారతులు - గావా నీకు
తోననెవ్వతెనంటు - దొరలెనో, నీవు
కానరాక దాగె శ్రీవేం - కటనాథ రచ్చలోన
॥నన్నే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము