Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 63 సంకీర్తన: 62
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 153
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఘంటారవము
నాకింత గుట్టు మీఁది - నడక చాలు
కాకరి బాగుల నీకే కాక - మాకేలరా?
॥పల్లవి॥
చనవుమాలిన యీవి - చప్పరించిన మోవి
యినుమడై నాకిచ్చిన - నేమిటికిరా
అనుమానపు వలపు - అటమటపు సొలపు
యెనయని నీ బుజ్జగింపు - యేటికిరా
॥నాకింత॥
కాంతాళపు పొందూ - కడివోయిన విందూ
యెంత నీవు జేసినా - యేటికిరా
వింత వింత మాటలూ - వేసదారి తేటలూ?
యెంతేసి నీవాడినా - యేటికి రా?
॥నాకింత॥
పలుమారు నీ యెగ్గులూ - పనిమాలిన సిగ్గులూ
యెలమి జేసిన మీదట - యేటికిరా?
అలమేలుమంగ శ్రీవేంక - టాధీశ గూడితి, న
న్నలయించీ బిలచీ బా - యగనేటికిరా
॥నాకింత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము