Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 114 సంకీర్తన: 114
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 159
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
నిండిన[1] వేడుకలెల్ల నీకె గాక
అండనె తాపము చల్ల[2] నమరెగా నాకు
॥పల్లవి॥
మగువకన్నుల మొక్కు మట్టెల పాదపుఁ దొక్కు
నిగుడు వాతెరనొక్కు నీకె కాక
అగడునెరుల చిక్కు అరచేతిపై చెక్కు
వగల గుక్కును[3] మిక్కు వన్నెగా నాకు
॥నిండిన॥
తొయ్యలిఁ గూడినరట్టు తుదచెమటలమెట్టు
నెయ్యపుమాటల గుట్టు నీకె కాక
పయ్యద జారినకట్టు భారంపు నొసలిపట్టు
కయ్యపుటలుక తిట్టు గలిగెఁగా నాకు[4]
॥నిండిన॥
మొగలిపువ్వులతావి ముంచినకన్నులకావి
నిగనిగ నగుమోవి నీకె కాక
సగము జారిన నీవి చనవుల నీదేవి-
నగుట వేంకటేశ నేఁడబ్బెఁగా నాకు[5]
॥నిండిన॥

(ఈ సంకీర్తన 5వ సంపుటంలో 272వ సంకీర్తనగా ఉంది.)

[1] తా.వెం 114 : నిండైన
[2] సా.రే. చల్లె
[3] కుక్కురు మిక్కు
[4] నిడురేకు 11: నీకు
[5] నీకు; నిడురేకు 81: నాకునూ
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము