సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 165 సంకీర్తన: 168
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 164
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 165 సంకీర్తన: 168
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 164
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సంతురావళి
| నీమహిమ కొనియాడ - నేర్పరి యెవ్వడు కామజనక! కామిత - కల్పభూజ! వరదరాజ!! | ॥పల్లవి॥ |
| పదం. సరసిజసంభవుడు - జన్నము సేయగను ?(సురవైరి) కనిపించ - కరుణించితివె వరదరాజ! గరుడనిపై వేడ్క - గారవాన వచ్చి, మ కరిగొట్టి కరిరాజు - గాచితివి వరదరాజ | ॥నీమహిమ॥ |
| దేవగురుండు భక్తితో - సేవించి సేయుపూజ కావించిన కొండగా గై - కొంటివి దేవరాజ! భూవివరమున బొడమి - భోగీంద్రుడా(ది)శేషుండు భావమున నుతియించి - పాలించితివి దేవరాజ | ॥నీమహిమ॥ |
| తిరువాలవట్టము విసరు - తిరుకచ్చినంబితో, న తిరహస్యములెల్లా - నానతిచ్చితివి దేవరాజ! ధరనెవ్వరు వేడినా - తగనందరిని తిరువేంకటనాథుడవై - వరమిత్తువు వరదరాజ | ॥నీమహిమ॥ |


