సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 161 సంకీర్తన: 165
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 167
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 161 సంకీర్తన: 165
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 167
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: కేదారగౌళ - అట
| నీవు గాఁగా నేను గాఁగా నేఁటి కాయఁ బోయను మీ వంటి చులుకనివారము మేమైతే మేటైనంతలేసిపనులు నేఁడౌను | ॥పల్లవి॥ |
| మంచిగందము నెఱపూఁత పూసుకొని మావాడ కాతఁడు రాఁగాపోఁగాఁ జూచి పొంచులు మా యింటి పంచ నుందువట బోగాలవారమటే ఎంచనేటికి తప్ప నీ మగఁడైతే యిలు వెళ్లకుండ నరికొట్టుకొని వల పించవలెఁగాక వూరివారిమీఁద పొంచు లుండవచ్చునా వో చెలియ | ॥నీవు॥ |
| ఎమ్మెకాఁ డాతఁడు మా వీథి నిలుచుండి యెవ్వరితోనో మాటలాడఁగా విని కొమ్మరో చూపెట్టుకొని వుందువట గుట్టు విడిచివున్నామా అమ్మరో ఆతఁడు నీ మగఁడైతే ఆన లిడుకొని వుండవలెఁగాక దిమ్మరికత్తెవై మా యింటిచుట్టూ తిరుగులాడ నాయమా | ॥నీవు॥ |
| నాయముగా అలమేల్మంగ వేంకటనాథుఁడు ననుఁ గూడి నవ్వినంతలోనె వోయమ్మ నేఁజెల్ల వూర నాఁట చాట వున్న పనులవారమా పాయక ఆతఁడు నీ పతియైతే పక్క పవ్వళించి వుండవలెఁ గాక కాయని కాపులు పూయని పూతలు గట్టి కాపురాలు గుత్తగొందురటె | ॥నీవు॥ |


