సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 85 సంకీర్తన: 85
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 232
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 85 సంకీర్తన: 85
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 232
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: ఘంటారవము
| లాలి లాలీ లాలి - లాలమ్మ లాలి లాలి యిందిర గూడి - లాలమ్మ లాలి | ॥పల్లవి॥ |
| పాలమున్నీటిపై - ఫణిరాజు తొట్టెలలో బాలవేదపు పఱపు - బాగాయ లాలి మేలి బంగరురేక - మించు మేల్కట్లలో కాలమేఘుని బాగు - (కననాయ) లాలి | ॥లాలి॥ |
| చెలువంపు నవనిధుల - చెంగల్వ పొత్తిళ్ల నెలకొన్న రవిచంద్ర - నేత్రుడా! లాలి వెలలేని యమృతంపు - వెన్నలారగించిన నలువ పొక్కిటి తమ్మి - నా యన్న లాలి | ॥లాలి॥ |
| మునికాంతలదె నిన్ను - ముదముతో బాడేరు మనసిజ జనకుడవు - మా యయ్య లాలి అనిశంబు నెదనెక్కు - నలమేల్మంగ నేలు ఘనుడ వౌ శ్రీవేం - కటనాథ లాలి | ॥లాలి॥ |


