సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 229 సంకీర్తన: 240
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 234
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 229 సంకీర్తన: 240
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 234
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| వద్దుర చవిగా చొక్కుదు - వైనను (నను) వేడెదువు (యిద్దరమొకటై పెనగక) - యిక నెక్కడి వలపు | ॥పల్లవి॥ |
| మేనులు రెండని యెరుగక - మెలగుచునుండితి(మ)పుడు నేనును నీవనియనగా - నేర్చితి (వి)దియేరా కానీ తొలుతటి వారము - కామనుచుండితివిపుడెం తైనానిక నను తడవకు - మాచెలిమే చాలునోరి | ॥వద్దుర॥ |
| పొద్దు గ్రుంకు లెరుగక - పొందుల నుండితిమప్పుడు అద్దమరేతిరి బోయే - నంటివి యిది యేరా అద్దిర కాలము మహిమో - అతనుడు పెట్టిన చిక్కో కద్దోలేదో యనుటకు - మా కలయికలే చాలు నోరి | ॥వద్దుర॥ |
| పెరతేనియ చవికని వా - తెరలే నానితి మప్పుడు అరుదుగ చక్కెర మోవి - మ్మంటివి యిది యేరా సిరి నన్నలమేల్మంగను - శ్రీవేంకటపతి కలసిన యిరవుగ పొందుల కంటెను - నికనెక్కడి వలపు | ॥వద్దుర॥ |


