సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 157 సంకీర్తన: 160
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 237
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 157 సంకీర్తన: 160
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 237
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సావేరి
| వలచినదానిని - వగలబెట్ట నీకు అలవియౌనా? వోరి! - ఆదివరాహ | ॥పల్లవి॥ |
| గందవొడినే నీకు - గానుకజేసితే అందుకొనవదేమి - ఆదివరాహ! విందైన కప్పురపు - వీడెమిచ్చినా నొల్లవు అందమా యిదినీకు - ఆదివరాహా | ॥వలచిన॥ |
| వేడుకనే నీతో మా-టాడగమారు మా టాడవదేమో - ఆదివరాహ కూడి గుబ్బలు - కుమ్మిబిగించితే నాడుకొనేవందరిలో - నాదివరాహ | ॥వలచిన॥ |
| చక్కెరకెమ్మోవిని-చవిగొమ్మని యిచ్చితే అక్కర గైకొనేవు - ఆదివరాహ మక్కువ వేంకటప్రభుడ - మరుకేళిమించితే, నక్కుదించననేవు - ఆదివరాహ | ॥వలచిన॥ |


