Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 202 సంకీర్తన: 211
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 239
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
వాని రమ్మనవే అక్కరో! - వాని రమ్మనవె చెలియ॥పల్లవి॥
వాని రమ్మనే ననవె - వాని రమ్మనే ననవె
మానినిరో చలము మాని - మలగునియనిన్ర స్వామిని
॥వాని॥
తనకునాకు బోదు - తరుణి! యేటివాదు
మనసు నిలువనీదు నె - మ్మదిని నిదురరాదు
॥వాని॥
చిన్ననాడె చాల - చెలిమి సేయ (మేల)
కన్నడ లికనేల - విన్నవించ జాల
॥వాని॥
కంతుఁడమ్ములేసీ - కరుణను (నెడబాసీ)
వింతజేసి శ్రీవేంకట - విభుఁడు జాగు చేసీ
॥వాని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము