Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 225 సంకీర్తన: 237
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 247
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
వీడె నెలకొన్నాడు శ్రీవేంకటగిరి మీద
వీడె కౌరవుల పాలిటికి విశ్వరూపుడితడు
॥పల్లవి॥
త్రిపురంబులపై వ్రాలిన యాఘన తీవ్రబాణమితడు
చపలపు బాణుని మర్మభేదియగు చక్రధరుడితడు
విపరీతము కంబములో వెలసిన వీర సింహమితడు
కపటపు భస్మాసురుని పాలిటికి కాలదండమితడు
॥వీడె॥
ధరణి కింద బలి నణచిన యాపాతాళభేదియితడు
పరశురాముని గర్వము నణచిన ప్రళయ వాయువితడు
ఒరసిన నరకాసురుని పాలిటికి ఉరుమని పిడుగితడు
దురమున నెదిరిన దనుజకోటులకు ధూమకేతువితడు
॥వీడె॥
అదుగో విధిరుద్రాదుల కెల్లను ఆదిమూల మితఁడు
పదిలముగా తను గొలిచిన యాశ్రితపారిజాతమితడు
కదలని యా బ్రహ్మాండకోటులకు కన్నతండ్రి యితడు
వెదకి వెదకి వరము లొసంగెడి వేంకటపతి యితడు
॥వీడె॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము