సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 151 సంకీర్తన: 154
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 250
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 151 సంకీర్తన: 154
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 250
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రమామనోహరము
| వెలదిరో తిల్లగో - విందుని వగలు తలచితే నిప్పుడును - తమకించీ మేనెల్లా | ॥పల్లవి॥ |
| చెక్కు నొక్కి ముద్దుబెట్టి - చిన్నిమోవిపంట నూది సొక్కుచు నరగన్నులు - సొంపులు మీరగను గ్రుక్కలుగా మోవితేనె కొద్దీ తేనియ - గోలుచునుండేవాని నక్కరో పొమ్మనగానో - రాడే నటవే | ॥వెలదిరో॥ |
| చనవునుగొని మూగుచును - సరసత నిక్కువల పనిగొనుచును పని గఱచుచు - భావము రంజిల్ల తనువులొకటిగా బెనగుచు - (తనిసి) వారలుండగా కినిసిననేనవ్వల బొ-మ్మన మనసౌనటవే | ॥వెలదిరో॥ |
| పచ్చవిలుతుకేళిని నెమ్మో - వానుచు కలయుచు ముచ్చట దీర్చుచు మోమును - మోమునజేర్చుచును పచ్చిదేర శ్రీవేంకట - ప్రభుడై ప్రేమముతో దన యిచ్చగనెదనుంచితేను - యేనెటు కాదందునే | ॥వెలదిరో॥ |


