సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 11 సంకీర్తన: 5
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 252
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 11 సంకీర్తన: 5
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 252
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
| వేఁడుకొందామా వేంకటగిరి - వేంకటేశ్వరుని | ॥పల్లవి॥ |
| ఆమటి[1] మ్రొక్కులవాఁడే - ఆదిదేవుఁడే వాఁడు తోమని[2] పళ్యాలవాఁడే - దురిత దూరుఁడే | ॥వేడుకొందామా॥ |
| వడ్డికాసులవాఁడే - వనజనాభుఁడే, పుట్టు గొడ్డురాండ్రకు[3] బిడ్డలనిచ్చే - గోవిందుఁడే | ॥వేడుకొందామా॥ |
| ఎలమిఁ[4] గోరినవరా - లిచ్చే దేవుఁడే వాఁడు అలమేల్మంగా శ్రీవేం - కటాద్రినాథుఁడే | ॥వేడుకొందామా॥ |
[1] ఆవంటి
[2] తొమ్మని
[3] గొడ్డురాండ్లకు
[4] యలమి


