సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 95 సంకీర్తన: 94
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 253
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 95 సంకీర్తన: 94
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 253
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదనామక్రియ[1]
| వేళ కొదవిన[2]వాఁడె - విందుగాక, తన వేళ లెంచి కొంచితే[3] - వేడుకలు పుట్టునా[4] | ॥పల్లవి॥ |
| ఇంతి మోమూ[5], నరవిరిగా జా - రే కొప్పు, విరులు యింత వొట్టూ[6] నీకుఁ జూడ - యెట్లుండె నమ్మా[7] చెంతరాహువు[8] తన - చెలికాని గదియఁగా కంతుఁ డంపగమిచేతఁ - గప్పినట్లుండె[9] | ॥వేళ॥ |
| సగము జారే[10] పయ్యదా, - జవ్వని గబ్బిగుబ్బలూ యెగువ కెంపులతాళి, - యెట్లుండెనమ్మా మొగుడుఁదమ్ముల మంచు - ముంచుకొని రాగా[11] తగవుగాదని రవి, - తరిమి నట్లుండె[12] | ॥వేళ॥ |
| అలమేలుమంగమేనూ - అలనాటి[13] విరహము యెలమి శ్రీవెంకటప్ప - డెట్లుండె[14] నమ్మా మలసి లేదీఁగె యెండ - మావుల కడువాడగా[15] పొలుచు నీలమేఘము - పొదివి నట్లుండె[16] | ॥వేళ॥ |
[1] ఈ పాట ‘తాళ్లపాక సంకీర్తనలు’ (a)ప్రతిలో నాదనామక్రియలోను, తంజావూరి ప్రతి (b)లో గౌడిపంతు-ఆటతాళములోను కలదు. సం.26 పీఠిక 10లో రాగం పేరు లేదు.
[2] (a) వేళకొదిగిన (సం.26 పీఠిక 10, వేళకొదవిన)
[3] (b) కొంకితే
[4] (b) వేడుక పుట్టునా
[5] (a) కొంతమోమూ (ప్రాస పూర్వాక్షర నియతి తప్పెను) (కొని యిట్టివి వీరి వాఙ్మయమున లేకపోలేదు. (26-112) (b) కొంతయు (నిర్మాణ భంగము)
[6] యింతోటు
[7] (a)అన్ని చరణములందును 2,4 పాదాంతములు యెట్లుండెనే-అట్లుండెనే అనే రీతి నున్నవి. (b) అన్ని చరణములందును 2,4 పాదాంతములు యెట్లుండెనమ్మా-అట్లుండె అను రీతి నున్నవి.
[8] రాహు.
[9] కాంతుఁడంపంగాను నాగమ్మినట్లుండె
[10] జార, సం.26 పీఠిక. జారు
[11] (a) మొగడదమ్ముల పైమంచు ముంచుకొనిరాగా (b) మగటిమి తమ్ములము మయంచు ముంచు కోరాద
[12] (a) దగ్గరినట్లుండెనే (b) తరమినట్లుండె
[13] (b) ఆ తొలతటి; అలతొల్లి సం.26 పీఠిక (b) ఆనాటి
[14] (a) శ్రీవేంకటప్పా యెట్లుండెనే (b) శ్రీవేంకటప్ప యెట్లుండెనమ్మ
[15] (b) పసివాడగ
[16] (a) పొదలినట్లుండెనె (b) పై బొదలినట్లుండె సం.26, పీఠిక పొడమినట్లుండె


