Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 196 సంకీర్తన: 203
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 254
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వసంత భైరవి
శంఖమా! పోయివత్తునా? - చక్రమా ! పోయివత్తునా?
లంకెలైన (పై) రెండు (చేతులా)- (లావు మెరిసిన) మీరూ రండు
॥పల్లవి॥
నీడ తిరుగని చింతా! - నే బోయివత్తునా
తోడు నీడ(వై) నీవూ నా - తోడనే రావమ్మా
వోడక పసిడి కంభమా! (నే) - వూరికి పోయివత్తునా
యేడ నున్నను వరా - లిత్తువు నీవూ రమ్మీ
॥శంఖమా!॥
చక్కదనపుటంజన - శైలమా! పోయివత్తునా?
నిక్కువమై నాకు నవ - నిధు లిత్తువు రావమ్మా
యెక్కువ నమృతంపు కో - నేరా! పోయివత్తునా?
అక్కజపు మా జీవన - మైపోదువు నీవూ రమ్మీ
॥శంఖమా!॥
ననిచిన శ్రీ వేంకట - నాథుడా! పోయివత్తునా
నెనరు (గల) వాడవై వెంట - నీవూ రా రమ్మీ
నను గన్న యలమేల్మంగ - నాంచారీ పోయివత్తునా?
వెనక ముందర (నిలిచి) - విజయ మిత్తువు రమ్మీ
॥శంఖమా!॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము